Monday, March 26, 2018

గలగల గోదావరి

పల్లవి:

గలగల,గలగల, గలగల,గల గల గోదావరీ...
కళకళ, కళకళ, కళకళ,కళకళ కోనసీమిదీ.....
పసుపుపచ్చ పారాణీ, పడతి సోయగమ్...
కడలి యంచు పచ్చచీర ప్రణవ స్వాగతమ్
                 ..లలలల!!

గోధారా గౌతమి రా....గమ్
కేళశుషీ కేరింతల మోహన రాగం
సుషమకీర్తి సాంప్రదాయ కుశలతీరమూ
డొక్కా సీతమ్మవారి.. జన్మస్థానమూ..
                  ..లలలల!!
వశిష్ఠుని విశిష్టాల యే..టి గమనమూ,
సెలయేటీ గమనాలా మధుర గానమూ.....  
బోయి భీమన్న కవుల వర్ణ కావ్యమూ..
ప్రమధ గణము లాలపించు లలిత గీతమూ...
                   ..లలలల!!

ప్రఫుల్లము ప్రసిస్తము, కపిలే..శ్వరము,
మందపల్లి మోక్షము, శనిదేవుని వాసమూ..
దయాధర్మ సమాజమీ.. సాగరతీరం.
నిత్యా..కళ్యాణమిదీ.. పచ్చతోరణం...
                ..లలలల!!
నారికేళ ఛాయాలూ నాట్యాలాపమ్
తల్లిఒడికి తా..ర్కాణం గోదారీ తీరము
తన్మయమే చూ..డచూడా సంధ్యాసమయమ్
తనివి తీరదిదే ఇదే స్వర్గధామమూ...

.          .........లలలల!!

దారి ప్రక్క పచ్చ పచ్చా వృక్షదామమూ ..
పసుపుదిద్ది పడచుమోమూ ముగ్దమోహనమ్
పచ్చ,పచ్చ,పచ్చచీర పుడమిభూషణమ్
ఇదేఇదే ఇదేనేమో  దివ్యో.. ధ్యానం
                ... గలగల!!

==============================
......యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment