Monday, March 26, 2018

కందబారిన మోము లేల?

అస్తమించే సూర్యునితో
నా బాధ చెప్పాలని
ఎప్పటినుండో అనుకుంటున్నా.
ఉండబట్టలేక ఇప్పుడు చెప్పేస్తున్నా
========================
1709
తెలుగు రచన
08/01/2018 05:19
====================
కందబారిన మోము లేల?
గిరుల చాటుకు మలుగుటేల?
ఉదయమేగా మెరిసిపోతివి
ఇంతలోనే మందమేల?

అంతేనోయీ,ఇంతే నేలిది.
అంతా పాపం,కొంతే నెయ్యం
ఇంతే,ఇంతే, ఇంతే నేలిది
వింత పోకడా ఇంతే నేలిది

ఖంగుతిని నువ్ ఇంతలోనే
గిరుల చాటుకి ఒరగనైతే
మనగ వలెనిక మేము ఎట్లు?
మనుజులం మరి తాళ నెట్లు?

వాయి వరసలు వెడలిబోయెను
మానవత్వం మంటగలిచెను
సంప్రదాయం సర్వ స్వాహా
శాంతి లేదిది హ్హా..స్వర్గసీమా?

చాటు మాటు చెల్లిపోయే
పగలు,చీకటి రాజ్యమేలే
చంపి బ్రతికే చచ్చు వెదవలు
చచ్చి బ్రతికే జనుల వ్యదలు

నిప్పు బెట్టే విక్రమార్కులు
దివ్వె బెట్టరు దుష్టు లీళ్ళు
త్రోవ పొడుగున ముళ్ళ కంపలు
తరుముకొచ్చే దొంగ వెదవలు

తిలకముండదు రక్తమేనోయ్
నరుకు లాటలు వ్యసన మీడోయ్
సాద్వికత్వం సాగనంపిన,
స్వార్ధపరులే అన్నదమ్ములు.

పాలు ఇచ్చే తల్లి ఉరస్సుల్
తొంగి చూసే దుష్టులీళ్ళు
పాలు త్రాగి రొమ్ము గుద్దే
దొంగ వెదవ మంద లీళ్ళు

వద్దు మాకీ పాపలోకము
పొద్దుగల్లే ఘోర పఠనము
చచ్చిపోయిన మానవత్వము
కంపుగొట్టే రొంపు లోకము

సాధ్యమైతే నొక్క పనిజేయ్.
స్థానమొదలి కిందకొచ్చేయ్
నిప్పు చెరిగేయ్, తుడిచి పెట్టేయ్.
ఒక్కపెట్టున మండబెట్టేయ్

పొద్దుగూకకు పైకి వచ్చేయ్
కిరణమొకటి విడిచిపెట్టేయ్
పొద్దుగూకుట విడిచిపెట్టెయ్
ఈ లోకమింతే ఇక తుడిచిపెట్టేయ్
====================
యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment