Monday, March 26, 2018

నీ చూపేలే అది నను తాకింది

◆◆◆◆◆◆◆◆◆◆◆
నీ చూపేలే అది నను తాకింది
ఈ గాలేదో నీ కబురే తెచ్చింది
నెలవంక తొంగి తొంగి చూస్తుంది
తెలిసింది,అది నీవెనని తెలిసింది

నల్లమబ్బు విడిపోయి వెన్నెలెలా గాచింది
ఇన్నినాళ్ళ విరహాన్ని మటుమాయం చేసింది
ఎడవాకిట వీణ పాట వినిపిస్తుంది
తెలిసింది, అది నీ స్వరమేనని తెలిసింది

చుప్పనాతి చూపుల్లో చిక్కుకున్న నీ మనసు
నన్ను మరిచి పోదని నాకిపుడే తెలిసింది
తెలిసి నవ్వుకుంటుంది,మనసు పాడుకుంటుంది
చిగురు తొడిగి పూలవనం ఆహ్వానం పలుకుతుంది

మళ్ళీ మళ్ళీ కోకిలమ్మ పాట పాడ నొచ్చింది
మల్లెలమ్మ పరవశించి పందిరి మనకేస్తుంది
తెరిచి ఉన్న తలుపు బయట నిలువ నేలనోయి
నిన్నే నిన్నే తలచుకునే మనసు నడగవోయి

తెలిసిందిలే, అది నీవే నీవేనని నా మనసుకు
వేగి రమ్ము, జాగుచేయకే, ప్రియా సఖీ
జాగు చేసి నీమనసుకు వేదనెక్కువే
తెరిచి ఉన్న తలుపు బయట నిలువనేలనో
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

తెలుగు రచన యలమంచిలి వెంకటరమణ.....✍

No comments:

Post a Comment