Monday, March 26, 2018

కథలు వ్రాయనా నేను

పల్లవి:
కథలు వ్రాయనా..నేనూ కథలు వ్రాయనా?
కన్నీటి శోకాలను కలంజేసి నేనూ

.... కథలు వ్రాయనా...

కడుపునిండనాకలిని,  కన్నీళ్ళతో నింపుకునే
కడ..దే..రని కథలన్నీ,
కూర్చి కూర్చి నేను వ్రాయనా?
................ కథలు!!

చరణం:
కూటికి నోచుకోక, కాటిలోన చోటులేక.
ఆదారి మధ్యలోన, నిరాదార శవాలను,
పేర్చి పేర్చి కథలు వ్రాయనా,
కథలు వ్రాయనా?
కథలు వ్రాయనా  నేను, కథలు వ్రాయనా?

జనాభాకు లెక్కరాక,
జనం మధ్య చోటులేక,
ఊ..రు బయట కుక్కలతో,
ఆ చెత్త కుప్పలతో,
అదోజాతి ప్రాణిలా అలమటించు ఈ మనుజుల
కథలుపేర్చి కథలు కథలు వ్రాయనా?

 చరణం:
రెక్కాడిన డొక్కాడని
ఆ బక్కా ప్రాణులన్ను.
కర్కోటపు కోరలతో
నొక్కి చంపు కామందుల
కథలు విప్పి,కథలు వ్రాయనా,
కథలు వ్రాయనా
కథలు కథలు  కథలు వ్రాయనా..

చరణం:
నిర్దోషుల దోషాలను
నిలదీసే అన్యాయం
దోషులకు దాసోహం... దేశచరిత వైబోగం..
కట్టల గుట్టలలో
ఊపిరాడనీ న్యాయం
విపులంగా..నేనువ్రాయనా?

చరణం:
వందుంటే పాతికప్పు,
పొలముంటే పంటకప్పు
ఏదీ లేని జనాలకు
ఏమున్నది నువ్వు చెప్పు?
చెప్పు చెప్పు..నీవు చెప్పు. ఏమి వ్రా..యనో నువ్వు జెప్పు

చరణం:
కథలు వ్రాయనా . .
నేను కథలు వ్రాయనా?
కన్నీటి శోకాలను కలంజేసి,
కథలు వ్రాయనా?
కడుపునిండినాకలిని
,కన్నీళ్ళతో నింపుకునే,
కడదేరని కథలన్నీ,
పోగుజేసి నేను వ్రాయనా?

కథలు వ్రాయనా  నేను, కథలు వ్రాయనా?........
===============
యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment