Monday, March 26, 2018

ఇన్ని నాళ్ళు వేచి ఉన్నా

==================
ఇన్ని నాళ్ళు వేచి ఉన్నా
పడుచుదనపు పరుగులాపి
నిన్ను చేరే వింత ఆశలు
నేడు కలిగేను, నేడు కలిగేను

నింగి నేలా సాక్షమయ్యి
నీవు నేను ఏకమయ్యి ,
నన్ను నేనే మరిచిపోయి
నీవు నేనై కలిసిపోయే,
ఇన్ని ఆశలు ఎలావచ్చేను

కడలి పొంగుల చాటుజేరి
నింగి నేలా ఏకమయ్యే
వింతలేవో నేడు చూసేను
అంతలోనే పులకింతలేవో
నన్ను తాకేను,నన్ను తాకేను.

ప్రకృతెంత  అందమాయేను
కొత్త బాషలు నేడు తెలిసేను ,
చిలిపి ఆశలు నాకు కలిగేను
పరువమే మరి పంచి యాయెను
నిన్నలేని వింతధోరణి నేడు వచ్చేను
ఇంతలోనే వింతలేవో ముంచుకొచ్చేను

పదుగురింటే పరువు పోయే
బిడియమేదో తెలిసి వచ్చేను
ఇన్ని నాళ్ళు వేచి ఉన్నా
పడుచుదనము పరుగులాపి
నిన్నలేని కొత్త  ఆశలు
నిన్ను చేరే వింత ఆశలు
నేడు కలిగేను, నేడు కలిగేను.
=======================

...........................య.వెంకటరమణ

No comments:

Post a Comment