Monday, March 26, 2018

లక్షల కొద్దీ ఫీజులు

==================
లక్షల కొద్దీ ఫీజులు
గుట్టల కొద్దీ బుక్కులు
గుక్కతిరగని చదువులు
బట్టీ పట్టే పరిక్షలు !
పరిక్షలయ్యాక పట్టాలు
పట్టబద్రుల చిట్టాలు
నిన్నటిదాకా ఒక పాట్లు
ఇప్పుడే మొదలు అగచాట్లు!
ఉద్యోగానికి పది సీట్లు
దరకాస్తులు పది రెట్లు
ఆ పట్టాలిక్కడ చెల్లవన్నట్లు
మళ్ళీ పరీక్షల కేర్పాట్లు!
డబ్బు కట్టైనా ఉద్యోగం కొట్టు
రేపు జనం నోట్లో మట్టిగొట్టు
బహుమానం దీనికి పేరెట్టు
లంచాన్నిలాగే అరికట్టు!
ఇదండీ మన సమన్మయం
అందరికీ ఇక్కడొక్కటే న్యాయం
డబ్బు కడితేనే సదుపాయం
లేదంటే,చెల్లదంటారీ అన్యాయం!
ప్రభుత్వానికి తెలీదంటీ అన్యాయం
మొన్న ఎలక్షన్ లో పెట్టిన వ్యయం
రావాలంటే,ఈ సమన్మయం
పాటించాలి , ఇదే నియమం
ఎప్పటిదాకానండీ దారుణం
నవ్వి పోతున్నారు  జనం!
==================
                   య. వెంకటరమణ

No comments:

Post a Comment