Monday, March 26, 2018

నారికేళ మందు నీళ్లు

========================
నారికేళ మందు నింపేవు నీళ్ళేట్లు
జంభరంబు నందు నింపేవు  రసమెట్లు
శైలమందు నీళ్ళు చమరించు నదిఎట్లు
కరియ నెనుము చనుల ధవళ దుగ్ద మెట్లు
మురికి ముద్దలు గలిపి మమ్ము జేసేవెట్లు
యుక్తి నంతా నింపి సృష్టి నింతా  జేసి
చెరకు బాణా లొదలి చివరికింతా జేసి
చెందకుండా నీ వెందు నయ్యా  తాతా
వంద లొందలు పెరిగి, మందలయ్యేరిచట
ముందు వెనకా మరిచి హద్దు మీరే రకట
వాయి వరసలు పోయే,ఒకరంటే పడకాయే
పరుల మాటలు విడువు,పరకాష్ట వీవొస్తే
పదిల మంటూ జెప్ప ప్రకరంబు మరిలేదు
పవళి నీడి రమ్ము  ప్రవలుండా వీవు  !!
=========================
                               య. వెంకటరమణ

అర్ధాలు: 
నారికేళ = కొబ్బరి  కాయ
జభరం  =  నిమ్మ కాయ
శైలి= పర్వతము
కరియ = నల్లని
నెనుము (ఎనుము) = గేదె( బర్రె)
ధవళము= తెలుపు
దుగ్దము - పాలు
రకట(అకట)= అయ్యయ్యో
పవళి= నిద్ర
ప్రవలుండు= సమర్ధుడు

భావాలు :
చెరకు  బాణము= మన్మద బాణము
తాతా = బ్రహ్మ దేవుడు
పరాకాష్ట= మరో  రూపంలో 
ప్రకరము = వచనాలు  (వాగ్దానం)

No comments:

Post a Comment