Monday, March 26, 2018

ఏ జిల్లా ఇది ఏ జిల్లా

ఓ జిల్లా. ఇది ఏ జిల్లా?
^^^^^^^^^^^^^^^^^^^^
1707
తెలుగు రచన
07/02/2018 19:45
==================
కంది బేడలు కొట్టి కొట్టి,
కందిపోయిన చేతులవిగో.
ఎండిపోయిన గొంతుకిన్ని,
నీళ్లు అందని రైతులరీగో.

పైపు లేసిన రాజు పాపం
పరము కేగెను ఖర్మయోగం
కాకి ఎంగిలి ముట్టనంటూ
ఎండ గట్టిన పైపు గొట్టం

చిత్రమే ఇది చిత్రావతికి
చిన్న చూపూ ఎత్తు ప్రాంతం.
ధాము పెట్టి డాము కట్టిన,
ఎండ గట్టిన ఎత్తు పదకం.

అప్పు జేసి,డిప్పు సిస్టము
మొక్కకైతే  నీరు కష్టం
పైపు లోనికి చుక్క రాదు
అప్పు తీరదు,చుక్క చేరదు

వాన కురిసే రోజు రాదు
సెనగ విత్తుకు మొలకరాదు
పొద్దుతిరుగుడు జాలి చూపులు
గాలిపెట్టుకు గొల్లు రాలే కంటనీళ్ళు

రాగి గంజి, కొర్ర అన్నం
రైతు పుణ్యం, అదే భాగ్యం
రాజులేలిన రాజ్యమయ్యీ
రగులుతున్నది ఫ్రాక్షనిజము

దున్న-దున్నల కుమ్ములాటా
అన్నదమ్ములు చెరో బాట.
ఈగలల్లే నలిగిపోతూ
ఈసిరోమను జనల రోదన

సత్య సాయి ట్రస్ట్ పుణ్యం
యేసు భక్తుల కనికరమ్ము (ఆర్.డి.ట్రస్ట్)
కూడు గుడ్డా చదువు సవ్యం
లేపోతే లేదులే చదువు కూడా వారి భాగ్యం

రాష్ట్రం మందే పెద్దజిల్లా
రాయులోరీ పాలనిల్లా
దిక్కుమాలిన కరువు కళ్ళు
ఈ ప్రాంతమంతా చిలికె జల్లు

రాజు రాయుల పాలనిక్కడ,
రాగి గంజే రాసె నిక్కడ.
పస్తులండే రైతు లిక్కడ.
పొట్టనిండని జనాలిక్కడ.

అడగకుంటే అమ్మ పెట్టదు,
అందరడిగితే భిక్ష అవ్వదు.
వలసి పోతే ఒక్కడేరా,
తరలి వస్తే దండు లేరా.

నీతి నడుగుట తప్పుకాదు
నీ నొప్పి ఎవడికి తెలియరాదు
సస్యశ్యామల కలలు గనడం
తప్పుకాదోయ్, కలలు కాందాం.
=====================
యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment