Monday, March 26, 2018

హరితబూరిత అవని అందాలు

మా పల్లెఅందాలు
రచన : తెలుగు రచన యలమంచిలి వెంకటరమణ
సంగీతం : సూర్యవర ప్రసాద్ అంబాజీపేట
..........రాగం
.........తాళం

పల్లవి:
హరతబూరిత అవని  అందాల చందాలు
స్వర్ణ కాంతుల వెలుగు ఉదయ కిరణాలు
మకుటమెరుగని పల్లె మాఊరి అందాలు
నేలకొంగిన నింగి కీకడలి సాక్షాలు
..............హరతబూరిత!

చరణం:
ఎర్రబారిన పళ్ళు ఏరేరి చిలకల్లు
ఏరు వాగును జేరి ఎన్నెన్ని పుష్పాలు
యాస ప్రాసలు కూర్చి జనపదుల గీతాలు
పొద్దు గూకే వాలు పిడక తాపిన పాలు
..............మకుటమెరుగని!

చరణం:
పడతి కొప్పున జేరి పలకరించెడి పూలు
నడుము చుట్టిన కొంగు నాతి హొయలు
ముంత గట్టెడి వెంకి ముంజేతి అందాలు
మట్టిగాజుల చేయి, మెట్టు, పట్టీలు
..............మకుటమెరుగని!

చరణం:
వండివార్చిన వెంకి వంట గుమగుమలు
తడక కేసిన చీర తానాల గలగల్లు
మల్లెపందిరి సొగసు,పైన వెన్నెల్లు
మాటుగాసిన మామ వెక్కిలి వేషాలు
..............మకుటమెరుగని!

చరణం:
సందకాడేజూడ సద్దుమణిగిన ఊరు
సందుజూసీ మామ చిలిపి చేష్టాలు
ఊపిరాడని బిగువు, ఊసులాడే సెగలు
ఉరకలేసే మనసు నుయ్యాల జంపాలు
.............నేలకొంగిన!!

చరణం:
కోర మీసం జోరు, పట్టమంచం గోడు
పట్టు విడువని మామ కేవి పగ్గాలు
కందబారిన మోము సిగ్గుదొంతర్లు
అందమైన సీమ మా పల్లెఅందాలు!!
................నేలకొంగిన !!
=========================
..........యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment