Monday, March 26, 2018

అలిసిపోతే నిద్రబోతే

================
అలిసిపోతే నిద్రబోతే
సుఖం కోరి కలలుగంటే
నిద్రబోతే కలలుగంటే
కడుపుకాలి బళ్ళుమంటే
కళ్ళముందర సత్యముంటే
ఎన్నికల్లవి ముందరుంటే
కొత్త ఆశలు మొగ్గతొడిగితె
ప్రణాళికలు కొత్తవైతే
నిన్న ఆశలు ఐదేళ్ళ కెదిగితె
అంగలేస్తూ అదీ వస్తే
నిన్నలాగే అదీ ఉంటే
రేపు కూడా శూన్యమైతే

వాన కురిసి, చిల్లుకారి
ఉన్న బట్టలు చల్లబడితే
వణుకు పుడితే, ఓర్వకుంటే
జబ్బు పడితే , జ్వరం తగిలితె
నరాలన్నీ బిగుసుకుంటే
ఊపిరాడక నిలచిపోతే
బ్రతుకు మీద ఆశలుంటే
బ్రతుకు దారులు కానకుంటే
రేపుకూడా శూన్యమైతే

కాయికష్టం బ్రతుకు సూత్రం
నుదిటి పైనా చెమట పడితే
విధి రాతలిలా చెరిగిపోతే
ఈ తప్పు కెవరిని ధోషులనును
ఈ రాతలేమని ఎవరినడుగును?
చివరికంతే విధి రాతలంతే
చెమట రాతలు చెమటకంతే
==================
యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment