Monday, March 26, 2018

రవి రశ్మికి అలవాటు పడిపోయాం

1586
తెలుగు రచన
17/11/2017
◆◆◆◆◆◆◆◆◆◆◆
రవి రశ్మికి అలవాటు పడిపోయాం
వెన్నెలెప్పుడో మరిచిపోయాం
వెలుగులో పరుగులు తీస్తూ
రాత్రిని చీకటికే వదిలేస్తున్నాం
భయపెడుతున్న భ్రమలో
భయాడుతూ బ్రతికేస్తున్నాం
విలువలేని సున్నాలకు వెలకడుతున్నాం
వెలవెల బోయే అంకెను
ఓ ప్రక్కన పడవేస్తున్నాం
నోరిప్పిన నేలకే నీరెడుతున్నాం
నెరగట్టిందని సరిపడుతున్నాం
చిన్నగ్గిని ఉఫ్అని ఊదేస్తున్నాం
అది పెద్దయితే వేడని పరిగెడుతున్నాం
కుళ్లులో బ్రతికే మనము
మల్లెవాసననెపుడో వెదిలేశాం
చచ్చయినా బ్రతికేస్తున్నాం
అందుకే మరణిస్తున్నాం
మర నిస్తున్నాం, బ్రతికేస్తున్నాం
వేడిశ్వాస రుమాలుతో అదిమేస్తున్నాం
అది మేస్తున్నాం, బ్రతికేస్తున్నాం
పొగలొస్తుంటే తలుపేస్తున్నాం
ఏసీ గదిలో బ్రతికేస్తున్నాం
అందుకే మరణిస్తున్నాం
తెల్లారిందదిగో, పరిగెడదాం
ఒకరి వెనుకొకరిలాగే నిలబడదాం
బ్రతికేద్దాం,బ్రతికేస్తున్నాం
చచ్చాయినా బ్రతికేస్తుందాం
ఉమ్మేస్తే తడవకుడా కొంగేసుకుందాం
వెనక తరం అడిగే ప్రశ్నలకు
ఒప్పేసుకుందాం,మా చేతకాలేదని
ఒప్పేసుకుందాం,
మట్టిగాజులు మనమేసుకుందాం
ఉంటే,..తలదించుకుందాం
◆◆◆◆◆◆◆◆◆◆◆

....యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment