Monday, March 26, 2018

ఎంతకైనా తగిందీ రాజకీయం

1595
తెలుగు రచన
18/12/2017
===================
ఎంతకైనా తగిందీ రాజకీయం
ఆలూ మగలకే పెట్టింది వైరం
భూమాత ఓరిమి స్త్రీలకు సైతం
పట్టించింది మగడి పైనే ఖడ్గం

విభజించి పాలించే సిద్ధాంతం
మాటల్లో మహిలొద్దరణాలక్ష్యం
మగడి ఉద్యోగం కోటా  తగ్గించడం
భార్య నెత్తిన బరువు మోపడం

అస్పృశ్య నివారణ అదో విడ్డూరం
సమానం చేస్తామని ఇల్లు కట్టివ్వడం
కులాల వారీ స్థలాలివ్వడం
ఎక్కడికక్కడ విడదీసి పెట్టె పన్నాగం

కలిసికట్టుగా బ్రతికే అవకాశం
కల్పిస్తే ఏర్పడదంటారా సమన్మయం
మాలపల్లెలు, ఈడిగ పేటలు
అగ్రహారము,కాదంటారా విభక్త యాగం

సాహిత్యం జోరందుకుంది
లేదందులో అనుమానం
విభజించి పాలించే సిద్ధాంతం
మనమే చేసాముగా సఫలం

పడిపోయికండి అందులో నేస్తం
విడదీకండిది తెలుగుని మాత్రం
ఎవరు వ్రాసినా అదే అక్షరం
ఎప్పటికీ మనమేగా తెలుగోళ్ళం

దేశ ద్రోహుల విగ్రహాలనే స్థాపించుకున్నాం
శత్రువచ్చినా పూజిస్తునే ఉన్నాం
తెలుగు కవులనెలా తీసేస్తాం
ఇది న్యాయంగా ఉందా నేస్తం

అన్నా చెల్లీ అని పిలుచుకుందాం
రాజకీయాలను ఆమడ పెడదాం
తెలుగు తల్లికి బిడ్డలమై ఉందాం
ఉందాం మనమంతా కలిసుందాం

చాలా బాధేస్తుంది నానేస్తం
కన్నీటితో వ్రాస్తున్నానిది వాస్తవం
తలుచుకుంటే కన్నీటిప్రాయం
కలిసుందాం దయుంచండి నేస్తం
==================
యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment