Monday, March 26, 2018

రైళ్ళున్ని పెరిగాయి

1708
తెలుగు రచన
07/02/2018 22:40
==================
రైళ్ళున్ని పెరిగాయి
కాలు మోప చోటులేదు
కారులిన్ని పెరిగాయి
నడవ నింత చోటు లేదు

ఇడ్లీ వొడా తినను బోతే
ఆడ నంతే వంతు రాదు
ఏడికెళ్లి వస్తున్నారన్నట్టు
ఏడికెళ్లి వస్తున్నారన్నట్టు

ముఖం మొత్తి పోయేనేమో
మృగాలన్ని తరిగిపోయే
తెల్లపులులు కాన కాయే
నల్ల కాకు లెళ్లిపోయే

సింహాలూ సన్నగిల్లె
లేడి,దుప్పు లేడబోయే
లేవు పిచ్చు కెగిరిపోయే
రాబంధులు రాకపోయే

కొల్లేరులో కొంగ లేదు
పల్లేరునూ లేదు లేదు
ఏడికెళ్లి వస్తున్నారీ మనుషులు
ఏడికెళ్లి వస్తున్నారీ మనుషులు

వేకన్సీ పిల్లప్పా,లేక విష్ణు
లెక్క తప్పి గాని ఈ లాటా
"జన్మించిన వాడు మరణించక తప్పదు
మరణించినవాడు తిరిగి జన్మించకా తప్పదు"

మనిషి చచ్చి మనిషి కాడు అదో లెక్క
మరి ఎత్తేందుకు జన్మలేవి ఏమిటబ్బా
==================
యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment