Monday, March 26, 2018

విద్వేషాలకు హద్దుల్లేవు

1591
తెలుగు రచన
12/12/2017
===================
విద్వేషాలకు హద్దుల్లేవు
విద్వాంసాలకు సిద్ధం సిద్ధం
ఎక్కడికక్కడ ఒకటే హోమం
మారణకాండకు అందరు సిద్ధం

నశించిపోతూ మానవత్వము
నామ మాత్రమే అక్కటితత్వం
ఎక్కడ చూసినా రక్తపాతము
మనుషుల్లాంటి సైతానులోకం

వాయి వరసలు దగ్ధం దగ్ధం
ప్రేమలన్నవి పెదాల వాటం
అంకిన కాడికి నులిమే లోకం
అందరికందరు ఇదేమిలోకం

ఆరో స్థానం ఐదో స్థానం
అంకెల్లోనే నిష్కర్షణము
అంతకంతకు అధమస్థానం
అందరికందరు అనాథవైనం

అణుబాంబెందుకు కొంతే ద్వంసం
ఎంతుందింకా యుగానికంతం
అయినా తీరని ఆరాటాలు
అర్ధం లేని పోరాటాలు

నక్షలవాదం ఒకప్రక్క
పక్కోళ్ళ వైరం ఒక ప్రక్క
ఇక్కడ జానాలదొక్కో లెక్క
కుక్కలు నయమవి ఎంచక్కా

కొట్టుకుజచ్చే జనాలు మారి
ఒక్కరినొక్కరు ప్రేమగ జేరి
ఉన్నదానితో తృప్తిగ నుంటే
ఉందా చెప్పు ఇలకు మించిన స్వర్గం స్వర్గం!!
============================
యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment