Monday, March 26, 2018

ఉగాది

శ్లోకం:
త్వమష్ట శోక నరా భీష్ట : మధుమాస సముద్భవా
నిభామి శోక సంతాపాం : మమ శోకం సదాకురూ
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
పల్లవి:
ఉగాశ్యాధి ఉగాది తెలుగు వెలుగు ఉగాది
పచ్చ తోరణాల గడప పచ్చడి షడ్రుచులుమేలు
ఉగాశ్యాధి ఉగాది తెలుగు వెలుగు ఉగాది
పచ్చ తోరణాల గడప పచ్చడి షడ్రుచులుమేలు
.............ఉగాశ్యాధి!!
చరణం:
చైత్రమాస శుక్లపక్ష సంధ్యోదయము
బ్రహ్మ సృష్టి పర్వంలో ఇదే మొదటి ఉషోదయం
వేదహరుని సంహారం విజయోత్సవమూ,
మహావిష్ణు అతురుతమీ మత్యవతారం
    .........ఉగాశ్యాధి!!

చరణం:
నూతన ఆశయాలకిదే అంకురార్పణం
జడప్రాయా జగత్తుని కదిలించే చైతన్యం
కొత్త కొత్త పనులకిదే తెరిచిన ద్వారం
తెలుగు వారి మన ఇంటా మొదటి పర్వము
.......ఉగాశ్యాధి ఉగాది !!

చరణం:
మంచి జరుగ వెడుకొనెడి మంచి తరుణము
మంచికి మించిలేదు మంచిపని పచ్చతోరణం
ఉగాధిలో ఉషస్సులు మీకే సొంతం
లేత చిగురు మామిడాకు కోకిల రాగం
...........ఉగాశ్యాధి ఉగాది!!
=============================
°°°°°°°°°యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment