1761
తెలుగు రచన
28/04/2018
==========================
తుపాకీ తన బుజమ్మీదుంటేనే గురి బాగుంటుంది
మనసుతో చేస్తేనే ఏకార్యమైనా నెరవేరుతుంది
చెప్పిన మాట వినడంలో తప్పులేదు
చెప్పుడు మాటలుంటేనే పెద్దముప్పవుతుంది
గొప్పలైనా, గొప్పులైనా ఎక్కేవయితేనే బాగుంటాయ్
చెప్పులయినా, తిప్పలయినా కొత్తలోనే కాస్త ఇబ్బందిగుంటాయ్
వయసు పెరుగుతుందనుకునే వాడు ఎప్పటికీ పెద్దవాడు కాలేడు
వయసు తరుగుతుందనుకునే వాడే తొందరగా సాధిస్తాడు
జీవితమైనా, జీలేబీ అయినా తికమకగానే ఉంటుంది
చవిచూసినవారికే తీపి తెలుస్తుంది
విలువైన వస్తువులు మన గౌరవం పెంచుతాయి
గౌరవమైన వారిచేతిలో లొనే వాటి విలువ పెరుగుతుంది
నీ అద్దం నిన్ను మోసం చేస్తుంది
నీ మనసు తెలియక అదికూడా మోసపోతుంది
కనిపించేవన్నీ నిజాలు కాదు .
కనిపించట్లేదని అవి అబద్దాలవ్వవు
తప్పులు క్షమించమని అందరూ అంటారు
క్షమించేది మాత్రం మీరొక్కరే.
==========================
...................................తెలుగు రచన
Friday, July 5, 2019
1761
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment