Friday, July 5, 2019

1570

1570
తెలుగు రచన
01/07/2017
=================================
అణువు చిన్నదే,పగిలితే విస్ఫోటమౌతుంది
ముళ్ళు చిన్నదే, గుచ్చుకుంటే విలవిలలాడిస్తుంది
చినుకు చిన్నదే, అది ప్రళయాన్నే సృష్టిస్తుంది
విత్తు చిన్నదే, అది ఫలించి మహా వృక్షమౌతుంది
దీపం చిన్నదే, అది లోకానికి వెలుగవుతుంది
తప్పు చిన్నదే, అది ప్రాణాంతక మవుతుంది
మాట చిన్నదే, జీవితాలను నిలబెడుతుంది.
మనసు చిన్నదే,చోటిస్తే లోకం తనలో ఇమిడిపోతుంది
గెలుపు చిన్నదే,సంతృప్తిని కొండంతిస్తుంది
చిన్నదని చిన్నచూపు చూడకు,
చిన్న సహాయం నిన్ను మార్చేస్తుంది.
=================================
యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment