Friday, July 5, 2019

1573

1573
తెలుగు రచన
02/08/2017
=================================
ఇంకింతే తెలవారదు-ఆ వెలుగులు ఇక  చేరవు
ఆ కలలే మళ్ళీను-నిజమెప్పుడు కానేరవు
పురి విప్పే ఆక్రోశం-పడగలు మరి దాటెరుగదు
తోడేళ్ళకు తొలకరింపు-దూరంగా నక్కరుపులు

వెలుగన్నది మరి రాదు-ఈ చీకటి విడిపోదు
కలలన్నా ఆగిపోవు-ఈ నేలకు మునకరాదు
మిణుగురు ఈ వెన్నెల్లు- పున్నమి మిడి చీకట్లు
దాటిపోని అగచాట్లు-పగటి కలల ఓదార్పులు

నాకు తెలిసి ఇదే కులం పేదిరకం, పెద్దిరకం
వయనాలా అంతరాలు-పగలు రేయి ఒకే తీరు
శాశనాలు ఎవరికొఱకు-చట్టాలవి ఎవరికొఱకు
చుట్టుతిరిగి చూసినా, నలుమూలల మోసాలు

శాంతి కొరకు మనిషి వేట-దుర్మార్గం కంచుకోట
తెగ మగ్గిన భ్రష్టత్వం బగ్గుమంటు ప్రతిచోటా
తలదాచే చోటులేక, తలోదారి జనాలు
విషసర్పం పడగల్లో, ఎటుచూస్తే అటు కోరలు

అంగలార్చు జనాలు- ఆర్తులు పడు అగచాట్లు
అనాదిగా అదే తీరు-అణచివేత వసూలు
చెల్లని శిలపెంకుల్లో చెల్లెడి ఈ జీవితాలు
ఇంకంతే తెలవారదు-ఆ వెలుగులు మరి చేరవు
================================
యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment