=========================
సమస్యల్లో నిద్ర మరిచాను
సంపాదనలో ఆకలి మరిచాను
వ్యస్తతలో బంధువుల్ని మరిచాను
పేరాశలో పరువును మరిచాను
మిడిసిపడి నన్ను నేనే మరిచాను
అధికమించి కాలాన్నే మరిచాను
మరిచి మరిచి మృత్యువునే మరిచాను
కబళించాకే తెలిసిందది మృత్యువని
లోకాన్ని మరిపించే ఏకైక స్నేహమనీ!!
.............

========================
No comments:
Post a Comment