Sunday, March 6, 2022

2006

2006
తెలుగు రచన
04/01/2021
===============
కొంచెమున్న చీమలూ
ఖరారైన మొక్కలు
జలములో చేపలూ
ఎగురుతూ పక్షులు
కలిసన్నీ బ్రతుకుతుంటే
కలిగన్నీ యోచించక
కలిసి బ్రతుకు నేర్వలేక
మనిషేందుకు మరీ ఇలా
కులాలుగా తెగలుజేసి
మతలుగా మరీ దీర్చి
ఆ మూలన వాడంటూ
ఈ మూలన వీడుంటూ
తెగలు తెగలు తలో దారి
తగలబెట్టు వెతలు బెట్టి
చావలేక బ్రతుకుతూ
బ్రతికినోళ్ళ చంపుతూ
ఎందుకయ్య బ్రతకలేడు
బ్రతికెటోళ్ళ బ్రతకనీడు
ఎందుకయ్య బ్రతకలేడు
బ్రతికెటోళ్ళ బ్రతకనీడు
బలాదూర్ నాయాళ్ళు
బ్రతకనేర్చి చంపుతుంటె
బాధ్యతగల పౌరులమై
బడలి బ్రతుకనేలనోయి
కలిసుంటే కలదు సుఖము
కలిసుందాం మనం మనం
కలిసుంటే కలదు సుఖము
కలిసుందాం మనం మనం
=================
యలమంచిలి వెంకటరమణ/.

No comments:

Post a Comment