Sunday, March 6, 2022

1806

1806
తెలుగు రచన
=============
కనికరము కరువైతే
కరిగి జారిపోతాను.
పలుకరింపు దూరమైనా
వసుధ గలిచిపోతాను
సేధదీర్చలేను నేను
జలది కలసిపోతాను
నయన జలము నేను
అశ్రువనే కంటిధార నేను!!
పలుమారులు అనుకుంటా
పదిలంగా ఉండాలని
విలపించే హృదయాలను
ఒరగేసుకు పోవాలని
అంతలోనే కరిగిపోయి
అంతరించిపోతాను,
బిందువు నేను-
కన్నీటి బిందువు నేను!!
కంటి పాప నా ఇల్లు
నా ఇంట ఉండలేను
ఇంత బాధకోర్వలేను
జలది కలిసిపోతాను
ఓదార్చుట చేతగాక
ఓరకంట పోతాను.
బిందువు నేను
కన్నీటి బిందువు నేను !!
ప్రేమించే హృదయాలకు
పెద్దగురుతు నేనవుతా
విడువలేనిబంధాలకు
వీడ్కోలో నేనవుతా
అశృవుగా మారినేను
అంతరించిపోతాను
నమితగత్తెనై నేను
క్షితినిగలిచిపోతాను.
మనసు బాధ తీయలేను
బాధలలో ఉండలేను
వదిలివెళ్ళి పోతాను
అశ్రువు నేను నీ అశ్రువు నేను!!
====================
యలమంచిలి వెంకటరమణ..✍

No comments:

Post a Comment