Sunday, March 6, 2022

2008

2008
తెలుగు రచన
09/01/2021
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
ఏ తీగదో ఈ రాగమూ
ఏ రాగమో ఈ గీతము
ఈ పాట నను పాడనీ
ఆ తీరాలు నను దాకనీ
ఏ శుక్తిలో ముత్యమో
పలు వరసగా మారెనే
ఏ తోఁట దీ కుసుమమో
స్మితమాయే నీ మోమునా
మెరుపు మేళవింపుల ఛాయ
విల్లు వంచిన నడుము
నడక నాట్య లహరి
నీది ఏ పురము నారీ
నల్ల ద్రాక్షాల కనులు
మల్లెపూవుల తెలుపు
చెంప జారిన ఒంపు కురులు
చిలుక నాసికమాని చెక్కిళ్ళు
చెవిజాటు నా తావు
చిన్న ముద్దు కొళ్ళు
చేసెటి అల్లర్లు జెప్పతరమా
కందిపోయే శంక నాచేయి తాక
మృదువైన కౌగిళ్ళల్లో
ఎదురిచ్చి నా ఊపిరి
కాపాడు కోవాలనీ
కలగనుట అతియాశనా
పెరియారు పెన్నిధులు
పేట ముక్కోటి దేవతలు
ఆశీస్సులందింప నతిధులెల్ల
నాగడియ నాదగుటయే భాగ్యము
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
యలమంచిలి వెంకటరమణ/.

No comments:

Post a Comment