Sunday, March 6, 2022

2051

2051
తెలుగు రచన
09/02/2022
=====================
చీకటి దారులు కమ్మేస్తున్నాయ్
దివిటీ దీపం వెలిగించండి
పగిలిన కాళ్ళు పగడండీలు
అగ్గీ మంటలు దగ్ధపు దారులు
దగాకోరులు దండులు దండులు
దారిపొడుగునా సీక్ష్యం ముక్కలు
దొబ్బ మరిగిన మాసి కుక్కలు (దిబ్బ అంటే మాంసము)
రక్తం మరకలు మల్లె పువ్వులు
ఎక్కడికక్కడ బ్రష్టాచారం
శవాల మీదే జన వ్యాపారం
మచ్చుకు లేని మానవత్వము
చచ్చిన వారికి ఎత్తు స్థూపము
చీమేదైనా చీమేనయ్యా
దోమేదైనా దోమేనయ్యా
మనుషులోనే మనుషుల్లేరు
పేదా పెద్దా కులాలు డేరు
జరగండయ్యా జనాలు వీళ్ళు
జనాలు నమ్మిన పలాశునుళ్ళు
పేదల రక్తం పెప్పరు సూపు
చొక్కా తొడిగిన మృగాలు వీళ్ళు
=====================
య.వెంకటరమణ/

No comments:

Post a Comment