Sunday, March 6, 2022

2010

2010
తెలుగు రచన
18/01/2021
=================
కాకపోదును కవిని నేను
లేకపోవును కవనశీలత
కాదు నేను నిద్వజనుడన్
విధికి లోబడి బ్రతుకు జీవుడ
మాటలొచ్చిన మ్రాను నేను
చూడగలిగిన గ్రుడ్డి వాడను
వినికిడెరిగిన బధిరి నేనూ
సొంత లాభం సంఘ జీవిని
తిండి కొరకు తినట మాని
నీడ కొరకూ ఎండ నెండీ
నాది కానీ దాని కొఱకు
నన్ను మరిచే మనిషి నేను
సృష్టి మర్మం ఎరుగ లేనీ
సృష్టి నేలే శ్రేష్ఠ జీవిని
కట్ట కట్టి కట్టెలందున
కాలిపోయే మట్టి మనిషిని
నిన్న మరిచీ రేపు ఎరుగని
నేడు నాపే నిగ్గు లేనీ
గోడ కెక్కిన పటం నేను
మాటవరసకు మనిషి నేను
నోటపెంటా గబ్బిలాలూ
నిశీధిలో గుడ్లగూబలు
తెల్లవారితె కుప్పతెప్పలు
మూత గప్పిన మురికి వాగులు
తానా తానా తందనానా
ముప్పు తప్పదు ముందరోయి
భూమికెందుకు బరువు చేటు
దాటుకెళ్ళే దారు లెదుకోయి
===================
య. వెంకటరమణ__/°°

No comments:

Post a Comment