Sunday, March 6, 2022

2014

2014
తెలుగు రచన
30/01/2021
===================
చలిలో వేడి కోరే జనం
వేడిలో చలి కోరే మనం
వెళ్ళేవారకూ నేడు భారం
నిన్న నీనాడు పొగడడం
పేక ముక్కల జీవితం
ఫలితం వరకునే పట్టుకుంటాం
గెలిచినా ఓడినా విసిరి కొట్టడం
ఎవరికి వారే ఉత్కంఠభరితం
అమ్మేవాడికెంతొచ్చినా తక్కువ
కొనేవాడికది చాలా ఎక్కువ
ఎక్కడండీ మన తప్పొప్పుకుంటాం
ఎదుటివారినే నిందిస్తుంటాం
తాను పొడవయ్యి బట్టలు కురసయ్యాయాంటాం
లావు మనమయ్యి బిగువయ్యాయాంటాం
ఎక్కడుంది నిజం చెప్పే ధైర్యం
కాల్చేది అగ్గయితే చెయ్యి కాలిందటాం
సూర్యుని కిందకు మనమెళ్ళి
సూర్యుడే నెత్తిమీదికొచ్చాడంటాం
ఉద్దండులమే సుమా మనం
సూన్యమైన ఆకాశాన్ని రంగుల్లో చూస్తాం
తాకివెళ్ళే వాస్తవం గాలినేమో చూడలేము
దోమతెర చేపల వల
అందులోకి దొమలెళ్ళవు
ఇందులో చేపలు బయటకు రాలేవు
కర్మను బట్టే ధర్మముంటుంది
ధర్మంలో కర్మమేముంటుంది?
గుణాన్ని బట్టే కులం గానీ
కులాన్ని బట్టి గుణమొస్తుందాండి
===================
య. వెంకటరమణ

No comments:

Post a Comment