Sunday, March 6, 2022

స్వప్నమా .. ఇది శిల్పమా కల్పనా ..

స్వప్నమా .. ఇది శిల్పమా కల్పనా ..
కవి కల్పనా కోటి వేణువులు ఒక్కపాటిన
మీటి నట్టి రాగం
దేవకన్యకలు మారువేశమున
నాట్య మాడు వైనం
అడుగు అడుగులో అప్సరసలదే
అదమ స్థానమది ఖాయం
నీ మేను వంపులు బాపు కుంచెలో
ఒంపులనుటనే భావ్యం
శంఖు దేరినీ కంట మెవరిదని
కడలినెట్లా అడుగ సాధ్యం?
మదుర వీణా స్వరాపీటిక తామ్రనాదా
పలుకు మధురం
మెరుపు మాయని మోము పిండితొ
ఎవరుజేసిన ఇంత శిల్పము
ఏ రసాభరితా ఫలముజీల్చి
అమర్చినారీ పెదవులన్నని
ఏ వృక్కుజేరి నేను అడగను తాకినంతనే
కందిపోయే ఇంత అందం
ఎవరి సృష్టని ఎవరినడుగను
ఏ మన్మదుండి చౌర బాణమది
నా మదిని తాకిన నైన కిరణము
ఎవరినడగను ఎవరినడగను
ఎవరు నీవని,ఎవరినడుగను?
.............................య.వెంకటరమణ

No comments:

Post a Comment