Sunday, March 6, 2022

2050

2050
తెలుగు రచన
01/02/2022
=====================
అమాస రాతిరి మిణుగురు వెలుగులు
భవితలు కానని భాగ్యజీవులు
దిక్కే తోచని దీనులు ధీరులు
మన్ను ప్రీతులు అన్నదాతలు
కానీ కానని నుదిటి రాతలను
మెలికలు తిరిగిన హస్త రేఖలను
చెమట సిరాతో కొడవలి ముక్కుతొ
కొద్దో గొప్పో సరిజేయంగా
సడలిన రాతలు తిరగేయంగా
ఏటా ఏటా నాటిన మొక్కల
పూచిన పువ్వుల ఆశల దండకు
ఘర్మ జలంతో జ్యోతుల పెట్టి
కర్మఫలానికి కాపలగాస్తూ
భంగపోయెడి భూమి పుత్రుల
నుదిటి రాతలను చదివే విద్యకు
తిరగ వ్రాసెడి జ్ఞానం కొరకు
నేనూ వీవూ తపస్సు చేద్దాం
నేనూ వీవూ తపస్సు చేద్దాం
తపస్సు చేద్దాం తిరిగేరాద్దాం
నల్ల కాగితం తెల్ల సిరాతో నింపే
యత్నం కలిసే చేద్దాం కలిసే చేద్దాం
=====================
.......య.వెంకటరమణ

No comments:

Post a Comment