Sunday, March 6, 2022

1917

1917
తెలుగు రచన
18/04/2020
======================
ఎన్నెన్ని అందాలు వింత భావాలు
చెంత చేరాలని ఎంతెంత అత్రాలు
ఓర్పులేనీ మనసు కేవి మార్గాలు
ఎన్నెన్ని అందాలు వింత భావాలు
ఆ జారు కేశాల చివరన్న కానీవె నన్ను
నీ బుగ్గ నిమిరేటి వరమైన ఇవ్వే నాకు
నీ కంటి నీలాల నీడైన కానీవె నన్ను
కనిపెట్టుకుంటా కలకాలముంటా
చిగిరాకు కొమ్మా చిలకాలనీకే
తెలవారినాక చిను కాననీకే
చిరు లేత చిగురు మరి వాడనీకే
పర పక్షి కన్ను పడనీకే పడనీకె
ఓ గాలి వీచీ మేఘాలు తాకీ
చిరు జల్లునై నన్ను చెలి చేరనీవే
శిఖ జారి చెక్కిళ్ళు సెలయెరుగా మారి
ఆ కొండ ఈ కొండ నడి మధ్య లోయల్లో
జలపాతమందు జాముండ నీవే
======================
యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment