Sunday, March 6, 2022

2017

2017
తెలుగు రచన
04/02/2021
==========================
ఆశలముందు అందరూ చిన్నవారే
ఆశయాలముందు అవాంతరాలూ అంతే
చంద్రునికంటే భూమి పెద్దది
భూమికంటే ఆకాశం పెద్దది
ఆ యన్నింటికంటే నీ ఆశయం పెద్దది
అంత పెద్ద ఆశయం గల
నీకంటే పెద్దది మరేదీ లేదు
ఇంకీ అవంతరాలో లెక్కా చెప్పు
నిన్ను నీవు చిన్నబిచ్చుకుంటే
లోకం నిన్ను కమ్మేస్తుంది
ఎత్తులో ఉండి చూడు
లోకం నీదనిపిస్తుంది
గమ్యం తెలియకుండా చేసే ప్రయాణం
లక్ష్యం లేకుండా చేసే ప్రయత్నం
దారం లేని సూదితో బట్టలు కుట్టడం.
వెలుగుల కోసం నీవెదురు చూడకు
పొద్దు పొడుపుకు నీవే ఎదురెళ్ళు
ఆశయం లోక కళ్యాణమైతే
లోకమే నీదవుతుంది
నీ ఆశయమే లోకానికి వెలుగవుతుంది
ఉరకలు వేసే కెరటాలు ఒడ్డెపుడూ దాటలేదు
దాటినా నిలచి ఉండలేదు
అలా అని అవి ఉరకలాపలేదు
నిరంతరంపోరాటంలో పరుగులాపలేదు
అర్థమలేని ఆ కెరటాలే అంత ఆరాటంతో ఉంటే
లక్ష్యంతోనే పుట్టిన నీవెందుకు నీరైపోతావు
నీ నడకాపాకు పరుగులు లాపకు
పొద్దు జారనీకు, మబ్బునక్రమ్మనీకు
సంకల్పంతో యుద్ధం చెయ్
ఆయుధాలే చిన్నబోతాయి
ఆకాశం వంగి నీ ముందుకొస్తుంది
అవకాశాలు నీ కొంగు నింపుతాయి
ఇంకా ఆలస్యమెందుకు చేస్తున్నావు
అదిగో నీ హద్దు, ఆకాశంలా అగుపిస్తుంది
విశ్వం నీవైపే తేరిపారి చూస్తుంది
వినిబడుతుందా ప్రకృతి పాడే స్వాగతగీతం
జేజేకారపు డమరు నినాదం
జాగు చేయక జాములు చూడక
వడి వడిగా అడుగులు వేస్తూ
అడుగులు అడుగులు పరుగులు చేస్తూ
అద్దరివరకు అంగలు వేస్తూ
పద పద పద పరుగులు దీస్తూ
పద పద పద పరుగులు దీస్తూ
==========================
య. వెంకటరమణ/..

No comments:

Post a Comment