Sunday, March 6, 2022

2053

icPublic
2053
తెలుగు రచన
02/02/2022
=================
కలమే లేని కవితన్నేను
కథలే లేని చరితన్నేను
భవితకు నేర్పే పాఠం నేను
నన్నే ఎరుగని సత్యం నేను
అనాది చరితకు ఆనవాలును
ఆశల పల్లకి బోయ వాడను
నిజాల వెనకో స్వప్నం నేను
నిజమే నేను నిజమా నేను?
మర్మం మ్మరిచిన మనిషిన్నేను
చరితే సాక్షం మరణం నేను
స్వప్న సీమలో విత్తున్నేను
స్వప్న సీమలో విత్తున్నేను
కొత్త చిగురుల మొక్కన్నేను
పలవల కొమ్మల చెట్టున్నేను
మళ్ళీ రాలిన విత్తున్నేను
================
య.వెంకటరమణ/..

No comments:

Post a Comment