Monday, August 15, 2022

నీకేమి లేవయ్య కైలాశ వాసా













1906
తెలుగు రచన .
22/02/2020 
==================== 
నీకేమి లేవయ్య కైలాశ వాసా 
పైన నీవైతే కింద మేమయ్యా 
 నీరు నిచ్చే కొండ నాపైన పెట్టావు 
నీరు దప్పిక మమ్ము నీ నేలనెట్టావు ఇబ్బందులన్నీ ఈడ మాకెట్టి 
నిబ్బరంగా నీవు నాడ నుంటావు 
నీకేమి లేవయ్య కైలాశ వాసా 

 నాగు బాములు జుట్టి నాట్యమాడే నీవు
గంగమ్మనే జుట్టు శిఖలోన బెట్టావు 
నెలవంక సింగారమేమి భాగ్యంబు నీది 
నా బాధలేరీతి నీకు జెప్పాలి కైలాసవాసా
 శివశంకరా శంఖధారీ శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు క్కు'బుద్ధి జనులీడేమో కోకొల్లలయ్యారు 
ఆ బుద్దులెవరిచ్చె ఆపలేవా నీవు ఆకాశవాసా
 ఇంతింత ఘోరాలు ఏల జాప్యం 
 నేలమొత్తం ఈడ చీడబట్టేనాయే
 నికృష్టులయితే నిండిపోయేనాయె 
 హిమగిరుల నడుమ ఏముంది స్వామి
 ఏతించుమోసారి బాట తప్పెను తీరు 
నీకెమి లేవయ్య కైలాసవాసా 

 నిన్ను చుట్టివచ్చి లోకమన్నా కొడుకు 
నీవన్న మాటకి లోకమెగురన్ 
బోయేనొక్క కొడుకు ఎంత భాగ్యం నీది 
ఏమి శివుడా ఈడేంది స్వామి ఇట్టాంటివాళ్ళు
మోసి కన్నా గానీ రోత పొమ్మందురాయే
  భ్రష్టమంతా ఇంత బ్రహ్మాండమే నిండె
 మోసమైతే చూడు లోకమంతానుండె వాయివరసలు బోయే తారతమ్యంబోయే
 తరుకెళుతున్నారు తల్లoటి బిడ్డల్ని
 తస్సదియ్యా వీళ్ళు తగలేయజూస్తుండ్రు సంశానులేముంది చచ్చినోళ్ళుదప్ప కాటిగాపుడాడ తగలేయనే జాలు బ్రతుకజస్తున్నారు చంపి బ్రతికేటోళ్ళుు
 చాలు చాలింకా శంఖు బూరించు 
ఈ కళ్ళు తెరిపించు నీ కన్ను తెరిచుంచు
నీకేమి లేవయ్య కైలాశ వాసా
 పైన నీవైతే కింద మేమయ్యా ======================
 యలమంచిలి వెంకటరమణ...✍🏻

No comments:

Post a Comment