Sunday, August 23, 2015

అర్ధంకాని తప్పుడు రాతలతో నా జీవిత డైరీ నిండిపోయింది

అర్ధంకాని తప్పుడు రాతలతో నా జీవిత డైరీ నిండిపోయింది
చెరిపే యత్నంలో పుటలెన్నో ఇలా మాసిపోయాయి
ఆశలు నిండిన సిరాబుడ్డితో అక్షరాలు పొదగలేక
ఆశలుగానే నా కలం వరకూ వచ్చి  ఆగిపోయాయి
తిరిగిచూడమంటే,తిరగవ్రాస్తానన్నాను తిరిచూడలేకున్నాను.
ఆశలు అందంగా ఉంటాయి. అందుకే తుమ్మెదలా చుట్టూ తిరుగుతుంటాయి
నాకుతెలిసి మృత్యువు కూడా చాలా అందంగా ఉంటుంది.
అందుకేనేమో తన కౌగిలి చేరితే బ్రతుకుమీద ఆశలు పోతాయి.
ఈ ఉదయానికెంత గర్వమో కదా!
మిర్రుగుడ్లేసుకుని చూస్తుంది.మరీ నెత్తెక్కుతుంది.
అస్తమయమది ఎరుగదుగా.
పాపం పడమటి కొండల్లో ముఖం దాచు కుంటుంది.
ప్రాణం ఖరీదు తెలిస్తే బాగుండు,పైకంతో కొనిపెట్టుకుందును.
పైపెచ్చూ,అది అమ్మేవాడెవరో తెలుసుంటే బాగుండును,
రేటైనా అడిగుందును.
అనాముఖుడు,ఆ రోడ్డు ప్రక్కన పడి ఉండుట నే చూసాను.
అమాయకుడు, ఆ ప్రాణం ఊరకనే ఇచ్చేసాడు.
కోట్ల ఆస్తి,పాపం అప్పనుకుంటా వదిలేసాడు.

..................................య.వెంకటరమణ

No comments:

Post a Comment