Thursday, April 21, 2022

2060

2060
TELUGU RACHANA
20/04/2022
========================
పరీభ్రమణమిలా తగదు ఓ మణిమాల
మరీ ఇలా జమీనుపై మతిపోయేలా
తెఱగంటిత్రోవలో తారొకటి లేదని
తలో దారి వెదుకసాగె చరా చరములు  

మిలా మిలా మేను ఛాయ  సువనకుమారీ
హొయలొలికే ఆ నడక నాట్యమయూరి
వంపులు మరి ఆ సొంపులు వంతులు మారి
నడుమొంకులు కురులొంకులు ఎవరీ నారి

నయనాలా నీ పేరూ నయన కుమారీ
మదువొలికే ఆ పెదవుల మధుబాలేమో
మణికట్టు పడికట్టు మణిమాలే మో
సిగ జుట్టు ఆ తీరు  శిరోమణి శిరోమణేలే

నయనాలా బాణాలు నను దూసుకుపోతుంటే
నిలిచేనా ఈ మనసు నయినబాలా
సిగలొనీ ఆ పూలు చెలాయించి చూస్తుంటే
చంచలమైపోరా మరి చిరంజీవులు

చెరకు బాణ మొకటి కాదు రతీ కుమారి
చెరో వైపు మన్మధుడు కృష్ణ మురారి
తునా తునకలన్నింటా నీవే మరి
ఇలా గాక ఎలా నేను చెప్పనో సిరి

సయ్యంటే సరే మరీ సరస కుమారీ
మాఘమాస మెందుకులే ముందునే సరి
తలో పేరు విడి విడిగా వద్దులే మరి
నా పేరే నీకిస్తా పంచుకో చెలీ

ఒప్పుకుంటే ముప్పు కూడ ముందు ఉందిలే
పాల గ్లాసు పంచుకునే పనే ముందులే
కార్తి సందులో కూడా కమామిషాలే
కథలుకథలు జనం నోట మనం మనములే
========================
               య. వెంకటరమణ/..

No comments:

Post a Comment