Tuesday, August 21, 2012

సంధ్య


ఎందుకు సంధ్యా నీకీ క్రోధం -సింధూరమళ్ళే కందెనె వదనం..
రక్కసులెవరని బయపడుతున్నావ్ ? రాజ్యాలేలే నేతలు వీళ్ళు .
వాళ్ళూ-వీళ్ళని చూడరు భానూ -అడ్డొస్తే  తెగ నరికేస్తారు .

అంతంతమాత్రం చేస్తేగాని -  అంతో ఇంతో ఆస్తులు రావు

అంతంత ఆస్తులు కావాలంటే -ఇంతేకదరా నెత్తులుగొట్ట .

నదులనుకోకవి రక్తం భాను . పారుతున్దిలా  రాజ్యాయలవెంట

కులాల గొడవలు అప్పుడె  పోయే - మతాల గొడవలు ఇప్పుడు పోయె .
తప్పదుకదరా వీళ్ళకి పాపం-ఏదో గొడవలు పుట్టిస్తారు-
పుట్టినవాళ్ళని  చంపేస్తారు .

తెల్లవాళ్ళు ఎవరూ లేరు - మిగిలినోళ్ళు 
మావాళ్ళే .
నల్లదనం కోసమని తెల్ల గుడ్డ లేసారు - నల్లదనం దాచమని తెల్లవాల్లకిస్తుండ్రు .

నిన్నో మొన్నో అన్నా చెప్పే - అంతకముందే బాబా చెప్పే .

ఎందరు చెప్పిన ఏమున్దోరే -చెప్పినవాళ్ళా  కంపే పోయే .
ఏడుందమ్మా కంబళి  అంటే - ఎడేసామో ఆడే ఉంది .

ఏమీ చూడకు -  ఎవరితోననకు .

ఏమనుకున్నావ్ నేతలు వీళ్ళు -నిన్నూ నన్నూ చంపేస్తారు .
మైమరపంటే తెలియదు కాదా?! మావాళ్ళనడిగి బాగా నేర్వు  .
తెల్లారేఝాముకి  సుద్ధంగా  మరువు .
పడమటి కొండలు బాగున్డాయి -పొద్దున్నోద్ధువు పదరా బాబు .

                                                                                                                                                                    రచన/..

No comments:

Post a Comment