Sunday, April 5, 2015

శివమయం

శివమయము సర్వంబు శివమేను సర్వంబు
సర్వంబు శివమయము  శివతాతి మయము
శిఖరంబు శివమేను సిథిలంబు శివమేను
శితమైన నామంబు శివ నామమొకటేను
శివద్యానమొకటేను ముక్తిదాయకమ్మూ
శివనామమొకటేను ముక్తి మార్గంబూ
నీలోని శివుడుండు నాలోను శివుడుండు
నీలోని శివుడున్నునాలోని శివుడున్ను
శితకంటుడైనట్టి ఆ శివుని రూపంబు
శివరూపి మనిషీ శిభి గాకుమోయి
శిభిగాకుమోయి శివమోయి నీవు
కరమెత్తి మొక్కిన్న కరుణించు శివము
ఖర్మలందున్ నిన్ను ఖడించు శివము
శివ నామమొకటేను మరి మోక్షమోయి
శివమయము సర్వంబు శివమేను సర్వంబు
సర్వంబు శివమయము  శివతాతి మయము
......................య.వెంకటరమణ

No comments:

Post a Comment