Saturday, April 4, 2015

చీకటి అడుగులు

చీకటులే అడుగిడుతున్నాయ్    
వెలుగులు ఇక మరుగౌతున్నాయ్ 
ఆశలు మరి  కొడిగడుతున్నాయ్
ఇక ప్రళయం రానే ఉంది.రానే ఉంది.

లోకంలో పాపాలకు హద్దన్నది లేకుంది 
దౌర్జన్యం రాజయ్యి పాలనలే చేస్తున్నది 
పదిపొట్టలు గొట్టిమరీ తనపొట్టే నింపుతుంది 
మనిషిని తెగదినడమనిన ఇదేకాదా!ఇదేకదా!

మోసాలను మేటులేసి,తెలివనేటి పేరుబెట్టి
సిగ్గులన్ని విడిచి పెట్టి,సోకులనే పేరుబెట్టి
షోషలిజం పేరుతోన వాయి వరసలిడిసిబెట్టి
ఓయబ్బా  ఏమిజనం ఇలా మారి పోయారు.

చింతజెట్టు మొదలు నరికి,చిగురులమ్ము జనాలు 
సంస్కారం అమ్ముకుని,సోకుజేయు మనోళ్ళు 
ఆస్థులుంటె చాలుగా అమ్మనాన్నలెందుకనీ  
వృధ్ధాప్యం నుసురుగొనే విధ్యార్థు మొరకులు.

ఒక్కడంటె సరేలే,ఇద్దరైన సరేలే,వందల్లో.. 
వందల్లో వందలంటే, ఒక్కడున్ను లేడంటే, 
ఎక్కడయ్య నిలిచేది?ఇంకెక్కడయ్య నిలిచేది?
వచ్చేస్తుందిక యుగప్రళయం. వచ్చేస్తుంది.

సిద్ధంగా  చింతలిడిచి. చింతనలో సిగ్ధమయ్యి
ఈ చింతనలెంతవరకు?మరీ అంటే వందవరకు. 
మరిచింతన లెందుకింక?మనుషులుగా బ్రతికుందాం
మనుషులుగా బ్రతికుందాం.మనుషులుగా బ్రతికేద్దాం!!
******************

                                          య.వెంకటరమణ

No comments:

Post a Comment