అదిగో! రాజ రాజనరేంద్రులా మహేంద్రి,రాజమండ్రి
అమరులే స్వయ మొనర్చినట్టి కోటిలింగాలవిగో.
గల గలా ప్రవహించు గోదావరి మనోగీతమదిగో
అదిగో రామదాసు గీతాస్వర మాధుర్య స్మృతి బద్రాద్రి
రాజమకుటస్మృతి కోటగుమ్మమదిగో
కోనసీమ కీర్తికాలవాలమదిగో
హరిత పూరిత సీమ అందచందాలవిగో
అవిగో అల్లవిగో
అచ్చుతెలుగు పడుచుల విరసిన మోములు
అరసి దిద్ధినట్టి ముగ్గు స్వాగాతంబులవిగో.
శరత్గోదారమ్మ చేయి చాచినంత, బాహూ మధ్యలోన
భాగ్యసీమగెలుగు కొనసీమయదిగో ..
అవిగో అల్లవిగో,
అమర వీరునితాలధ్వజంబులవిగో.
గంటి గోదారమదిగోపండు వైడూర్యమదిగో,
పసిడి సంస్కారములకు ఆలవాలమదిగో.
భావన్నారాయుణడేకద భాగ్యమొసగెనీడ,కాకినాడ.
ఆంతర్యమెరుగు ధైవమాడనేకద అంతర్వేదిపురము
రాచబాటనంటి రావులోరిపాలెం.కడలికామడేకద-
కడియమంతవనము, కనక-పూలోచనము
అదిగో అల్లదిగో
అమర చరితమున్నఆంధ్రదేశామదిగో
భాగ్యమొసగు తల్లి భాగ్యనగరమదిగో.
కృష్ణవేణిపారు కీర్తి భూమియదిగో
కృష్ణరాయుల కొలువు కళాక్షేత్రమదిగో.
క్రాంతివీరుల తల్లి-నా ఆంధ్రదేశమదిగో
అందు జన్మనొంది,నే ధన్యమాయెనిధిగో...
మరు జన్మనొసగు తల్లీ.భరత మాతా !
య.వెంకటరమణ
అమరులే స్వయ మొనర్చినట్టి కోటిలింగాలవిగో.
గల గలా ప్రవహించు గోదావరి మనోగీతమదిగో
అదిగో రామదాసు గీతాస్వర మాధుర్య స్మృతి బద్రాద్రి
రాజమకుటస్మృతి కోటగుమ్మమదిగో
కోనసీమ కీర్తికాలవాలమదిగో
హరిత పూరిత సీమ అందచందాలవిగో
అవిగో అల్లవిగో
అచ్చుతెలుగు పడుచుల విరసిన మోములు
అరసి దిద్ధినట్టి ముగ్గు స్వాగాతంబులవిగో.
శరత్గోదారమ్మ చేయి చాచినంత, బాహూ మధ్యలోన
భాగ్యసీమగెలుగు కొనసీమయదిగో ..
అవిగో అల్లవిగో,
అమర వీరునితాలధ్వజంబులవిగో.
గంటి గోదారమదిగోపండు వైడూర్యమదిగో,
పసిడి సంస్కారములకు ఆలవాలమదిగో.
భావన్నారాయుణడేకద భాగ్యమొసగెనీడ,కాకినాడ.
ఆంతర్యమెరుగు ధైవమాడనేకద అంతర్వేదిపురము
రాచబాటనంటి రావులోరిపాలెం.కడలికామడేకద-
కడియమంతవనము, కనక-పూలోచనము
అదిగో అల్లదిగో
అమర చరితమున్నఆంధ్రదేశామదిగో
భాగ్యమొసగు తల్లి భాగ్యనగరమదిగో.
కృష్ణవేణిపారు కీర్తి భూమియదిగో
కృష్ణరాయుల కొలువు కళాక్షేత్రమదిగో.
క్రాంతివీరుల తల్లి-నా ఆంధ్రదేశమదిగో
అందు జన్మనొంది,నే ధన్యమాయెనిధిగో...
మరు జన్మనొసగు తల్లీ.భరత మాతా !
య.వెంకటరమణ
No comments:
Post a Comment