Saturday, April 4, 2015

భారతి

సువిశాల భారతి, సునందభరిత భారతి
సుమాధుర మన భారతి, స్వర్ణరాశి భారతి.
కరుణభరిత ఆలవాలమీ భారతి,మన భారతి.
దయారసా మాలతి మన భారతి,మన భారతి.

అజంతా కళావతి. అమరావతి మన భారతి
ఉమాపతీ యాలవాల శోభాయుత ధరయత్రి
హిమగిరీ చిరపూంజీ హీరాకుండు మనభారతి
సుహాసినీ సుబాషిని అనన్యాది భారతి,భారతి.

స్వర్ణలతా  వనజాక్షి, సుసంపన్న భారతీ,
రత్నరాశి భారతి, రమ్యశీలి మన భారతి
స్వర్గసీమ భారతి, స్వతంత్ర్యమూర్తి భారతీ
స్వర్గమంటె ఇదేనోయి అదే మన భారతీ !!

                                    య.వెంకటరమణ

No comments:

Post a Comment