Saturday, April 4, 2015

రేపులేని రేపుకొరకు

రేపులేని రేపుకొరకు మాపంతాగాపుగాచి
గాచి గాచి కాయలాయే- కళ్ళకాయలు 
ఎంతకాలమెదురుచూపులూ,ఇంకెంతకాలము  
నిన్నచూసే,నేడుచూసే,మాపంతానేగాచే,
రేపనేటి రేపు’కొరకు మాపంతా ఎదురుచూసే
ఎదురుచూసి,ఎదురుచూసి ఎదలు గాయగాచే 
మారె గాని మీపదవులు, మారకాయే మాబ్రతుకులు 
పదవులైతే మారిపోయే – ప్రణాళికలె వచ్చిపోయే 
ప్రణాళికలే పంచనాకు రేపనేది రాకపోయే.
రేపనేటి రేపుకొరకు మాపంతాగాపుగాచి 
మాచిపోయే మా బ్రతుకులు, మాడిపోయే మాగడుపులు.
బ్రతుకుదెరువు కానరాక బండబారె నీబ్రతుకులు.
గట్టమాకు ప్రాజెక్టులు, గట్టిగానే నడుంగట్టి
ఎండగట్టే మా బ్రతుకులు,తడిపెట్టే దిక్కులేక.
రేపనేటి రేపుకొరకు రాసిపెట్టె మా రాతలు 
రేగడాయే మా భూములు, సాగాకాయే మా బ్రతుకులు
అందరూ చెప్పేటోళ్ళు,అందనాలు జూపెటోళ్ళు
పదాలకు లోటులేదు,పంచనాకు కాసులేదు
పంచనాకు రేపులేదు,రేపనేది రానెరాదు.
పంచనాకు దమిడి లేదు , దాచ మీకు చోటులేదు 
రేపనేటి రేపుకొరకు  దాచనీకు చోటులేదు 
పంచనాకు దమిడి లేదు,దాచ నీకు చోటులేదు
చేతకాని వె__వలమే చమత్కరమేమున్నది? 
ఏ చరితలు తిరగ చదివినా ఏమున్నది ఇదే కదా 
రేపులేదు మాపులేదు –రేపనేది రానెరాదు !!


                                       య.వెంకటరమణ

No comments:

Post a Comment