కాలగమనంలో మైలురాయి నేను
ఓ అడుగు నడిచే నేనలిసిపోతను.
అనంత విశ్వంలో అల్పరేణువు నేను
ఆమడెగిరే నేనారిపోతను.
పెనుతుఫానులో నీటిబిందువు నేను,
దిగంతాలకె నడక తెలిసీ, నే పరుగునాపలేను.
కాల గమనంలో మైలురాయి నేను,
ఎంత ఉరికినా మరో రాయి తాకలేను.
విస్వతలంపై ఒత్తు మంట నేను,
కగడాలా వెలిగిపోవాలని ఆశపడతాను
ఉత్త గాలికె నేనారిపోతాను
ఊహకందని విశ్వమందు ఊరకే నేకలలుగంటు,
ఊపిరాగే క్షణంవరకూ నాది-నాదని బొంకుతాను.
మనిషి నేను,మనిషి నేను.మన్నుగలిచేవరకు నేను.
. . ............రచన/.. (2011)
No comments:
Post a Comment