పుణ్య భూమి నాది. భరతభూమి నాది
వీరవనితలనెందరినో కన్నభూమి నాది
వీరులకూ జన్మనిచ్చి వీరమాత పేరుబడ్డ
పుణ్య భూమి నాది. భరతభూమి నాది
దయామయుడు యేసుక్రీస్తు నడిచినట్టిది
అల్లాను అక్బర్గా అక్కున మరి పెట్టుకున్నాది
శ్రీరాముడు శ్రీకృష్ణుడు వెలిసినట్టి భూమిదీ
సద్గురుకు బౌద్దులకు సకల ధర్మమూర్తులకు
స్థానమైన పుణ్యభూమి భరత భూమినాది
వేదాంతులు మేధావులు వేలకు వేలమంది
విరబూసిన పువ్వుల్లా వికసించిన భూమినాది
పుణ్య భూమి నాది. భరతభూమి నాది
ఏక కాలమందు చూడు ఎన్ని రుతువులు
తూరుపులో వానలైతె పశ్చమాన ఎండలు
ధక్షణాన ఎండలైతేె ఉత్తరాన మంచువానలు
గలాగలా పారుతున్న నదుల భూమినాది
హరా బరా నిండియున్న జన్మభూమినాది
భరత భూమినాది.సకలధర్మ సముదాయము
సకల సౌఖ్య సౌలభ్యం. సర్వ జాతి సమూహము
సుసంపన్న సమలోచనమీ భూమీ భరతభూమి
పుణ్యభూమి నాది.భరతభూమి నాది.నమోనమామి!!
య.వెంకటరమణ
No comments:
Post a Comment