Saturday, April 4, 2015

చెమట కంపు

కంపు కంపంటారు చెమట కంపంటారు
చెమట కంపందు రుచిరమెరుగని వాళ్ళు .
చెమటోడ్చి చూడోయి చవట దద్దమ్మా
ఇంపైన ఆకంపు సొంపౌను చూడు పెద్దన్నా

అత్తరంటుంటారు, మస్తుగుందంటారు.
అత్తరేముందాడ ఉత్త చెమటేనోయి .
మొత్తమంతా చెమట,మస్తంత నీదోయి
ఇంపైన ఆ కంపు సొంపైను చూడోయి.

ఎండకాగే  వాళ్ళు, ఎంత గొప్పోళాళ్ళు
ఎండకెండీ మనకు నీడనిచ్చే టోళ్ళు
మెండైన వాళ్ళాళ్ళు, ఎండకాగేటోళ్ళు
ఎండకెండీ మనకు నీడనిచ్చే టోళ్ళు

అంతస్థులంతస్థులూ  హక్కైతే మనకిత్తురు
హక్కుదేముందాడ ఆ చలువ చెమటయ్య
ఆ చెమట తనదయ్య ఘనతైతే మనదయ్య
ఇంపైన ఆ కంపు సొంపైను చూడయ్య

చలువ బట్టలు చూడు ఛందాలు దిద్దేను
దిద్ద రుద్దీన చెయ్యి మొద్ధయ్యిపోయేను
కంపు కంపంటారు, చెమట కంపంటారు
చెమట కంపందు రుచిరమెరుగని వాళ్ళు.

కంపు కంపంటారు చెమట కంపంటారు
చెమట కంపందు రుచిరమెరుగని వాళ్ళు .
చెమటోడ్చి చూడోయి చవట దద్దమ్మా
ఇంపైన ఆకంపు సొంపౌను చూడు పెద్దన్నా

                            య.వెంకటరమణ

No comments:

Post a Comment