Saturday, April 4, 2015

స్నేహబంధం

స్నేహమనే బంధమెంత మధుర బంధము
ఝటిలమైన ఈ పదము ఎంత సౌమ్యము
మంచిిస్నేహమొక్కటి దేవుడిచ్చినావరము
స్నేహాన్ని కాపాడుట ఎందరికట సాధ్యము 

కష్టాలు కళ్ళునిండి జాలువారు సమయంలొ
కళ్ళముందు నిలిచేది స్నేహబంధమొక్కటే
కొలుకుదాటు కన్నీటిని అదుపుజేయునస్తము
అదే అదే స్నేహము అందమైన బంధము 

మనసులోని భావాలకు కళ్ళముందు సాక్షము
హృదయాంతర మిప్పగల ఒకే ఒక్క బంధము 
తనమనసుకి అద్దము తానెరుగదు స్వార్ధము
అందమైన బంధము అదే కదా స్నేహము 

దిక్కులలేని నామకి చుక్కాని స్నేహము
వేధనలో ఓదారుపు  అదేకదా స్నేహము
మనసుమాట తెలుసుకునే ఒకేబంధము
మరి దేనికి సాటి కాదు స్నేహబంధము 

స్నేహమనే బంధమెంత మధుర బంధము
ఝటిలమైన ఈ పదము ఎంత సౌమ్యము
మంచిిస్నేహమొక్కటి దేవుడిచ్చినావరము
స్నేహాన్ని కాపాడుట ఎందరికట సాధ్యము 

                                 య.వెంకటరమణ

No comments:

Post a Comment