Sunday, April 5, 2015

రైలు యాత్ర

కస్టంసుంటాయ్ – కాంట్రోల్సుంటాయ్
రైల్వే పరిధికి అవి రాకుంటాయ్
పొద్దున్నన్నం రాత్రికి పొట్లం
పచ్చనోటుకు తక్కువరాదు
చేతికందితే కడుపుకందదు
కడుపుకందితే చేతికంటదు
ఇంతేనోయి తింటే తినుమోయ్

కోట్ల ఖర్చుతో  వాటర్ ప్లాంట్లు
స్టేషన్నిండా కుళాయి స్పాట్లు
బొట్టే రాలని బడాయి టాప్లు {tap}
బోటిల్ రేటు పదిహేనోయి.
పాతిక్కమ్మిన అడిగేదెవరోయ్?

స్వచ్చభారతది  వీధుల్లోనే
ఫోటోల ఫోజులు పేపర్లోనే
గబ్బునిండినా బాతురూములు
సుభ్రతలుండవు సుతరామైనా
వరసకు ముగ్గురు వసూలు కోసం
రోగాలు బద్రం అవి మన కోసం

నూట పాతికా కోట్లమంధిలో
పాతికకోట్లే డబ్బున్నోళ్ళు
ముందోరెండు, వెనకోరెండు
జనరల్ వాళ్లకు అంతేనండోయ్
పట్టకపోయిన కుక్కుకు చావు
రైల్వే వాళ్లకు డబ్బులు చాలు

సీట్ల సంఖ్య మరి డబ్బైరెండే
వెయిటింగు సీట్లు వందలలోన
క్లియరెన్సు కావు – ఊరొచ్చింది
పదరా పోదాం – డబ్బులు రావు

.......................................... య. వెంకటరమణ

No comments:

Post a Comment