ఓడలు బళ్ళౌతూ నేజూసా -బళ్ళే ఓడలగుట నేజూసా
మేడలు గుడిసెలౌతూ నేజూసా-గుడిసెలు మేడౌతూ నేజూసా
అహంకలిపిన అడుసుతొ ఏ కోటలు మరి నిలబడ్డాయ్
తలవంచని ఏ రాజుకు కిరీటాలు తలకెక్కాయ్
అవలక్షణ సాధనమే అహంకార విత్తనము
ఆదినందు విత్తనము తలవంచుకునంకురము
వృక్షమై ఎదగడం ఎదిగి ఫలములీయడము
విర్రవీగినంతనే నేలకొరిగిపోవడం కట్టెలయ్యి కాలడము
ఒదిగి ఒదిగి ఎదుగజూసు ఉదయభాను కిరణాలు
ఎదుగుకొద్ది చూడు మరి చీకటికే ఛేధనాలు
విచ్చలవిడి వైనంలో నడినెత్తున నాట్యమాడు మండుతున్నసూరీడు
మరి కాడా పతనము,పడమటలో మటుమాయము చీకటిదే రాజ్యము
ఓడలు బళ్ళౌతూ నేజూసా -మేడలు గుడెసౌతూ నే జూసా
మిడిసిపడీ నేలకొరుగు మహామహుల నే జూసా
చనిపోయీ బ్రతికున్నా మనుజులనూ నే జూసా
బ్రతకాలని చనిపోయే మూర్ఖులన్ను నే జూసా
చూసా నే జూసా ఆ మనుషుల నే జూసా !
..................... య.వెంకటరమణ

No comments:
Post a Comment