మది బాధనెరిగిన బంధం కరిగిందిలా
కరుణే తప్ప కాఠిణ్యమెరుగని అద్వితీయ భావం చిరుజల్లై కురిసి
పిలవకనేపలికే మది బాధల్ని పంచుకునే
భాధ్యతెరిగిన కనులు కురిపించే అనుబంధపు ధారయిది
బరువెక్కిన మదికి బాషలేదు
పంచుకున్నాయి లిపిగా
మరి చదివేది అందరితరమా
జ్ఞాపకాలలో జలపాతానివో
ఆశలే అడియాశలైన వేళ సెలయేటివో
ఆర్తిగా అందరిలో దాగిన సంద్రానివో
అన్నిటినీ కడిగే పన్నీటి జల్లువో
బాష్పమా నీకిదే నా కృతజ్ఞాంజలి !!
...................మాధుర్య
కరుణే తప్ప కాఠిణ్యమెరుగని అద్వితీయ భావం చిరుజల్లై కురిసి
పిలవకనేపలికే మది బాధల్ని పంచుకునే
భాధ్యతెరిగిన కనులు కురిపించే అనుబంధపు ధారయిది
బరువెక్కిన మదికి బాషలేదు
పంచుకున్నాయి లిపిగా
మరి చదివేది అందరితరమా
జ్ఞాపకాలలో జలపాతానివో
ఆశలే అడియాశలైన వేళ సెలయేటివో
ఆర్తిగా అందరిలో దాగిన సంద్రానివో
అన్నిటినీ కడిగే పన్నీటి జల్లువో
బాష్పమా నీకిదే నా కృతజ్ఞాంజలి !!
...................మాధుర్య
No comments:
Post a Comment