ఊరు బయట కోనేరు సెలయేటీ కెరటాలు
వేణువంటి ఈలపాట చెట్టు చేమలు
తొలకరిలో పులకించిన తోట పువ్వులు
స్వాతిముత్యమదో కెంపు పల్లె సొగసుకి
లేగదూడ గెంతులు,మేకపిల్లలరుపులు
ముద్దబంతిపూలపైన తుమ్మెదమ్మ చిలిపి చేష్టలు
దోబూచీ దొంగాటల నీలి మబ్బులో
విరబూసిన ఇంద్రధనుసు ఏడురంగులు
ఏ దేవత చేజారిన స్వర్గమో కదా
ఇలలోనే సాధ్యమైన స్వర్గ దర్శనం
పల్లె పేరుతో వెలసిన మరో స్వర్గము
పల్లె పేరుతో వెలసిన మరో స్వర్గము
..................య.వెంకటరమణ
వేణువంటి ఈలపాట చెట్టు చేమలు
తొలకరిలో పులకించిన తోట పువ్వులు
స్వాతిముత్యమదో కెంపు పల్లె సొగసుకి
లేగదూడ గెంతులు,మేకపిల్లలరుపులు
ముద్దబంతిపూలపైన తుమ్మెదమ్మ చిలిపి చేష్టలు
దోబూచీ దొంగాటల నీలి మబ్బులో
విరబూసిన ఇంద్రధనుసు ఏడురంగులు
ఏ దేవత చేజారిన స్వర్గమో కదా
ఇలలోనే సాధ్యమైన స్వర్గ దర్శనం
పల్లె పేరుతో వెలసిన మరో స్వర్గము
పల్లె పేరుతో వెలసిన మరో స్వర్గము
..................య.వెంకటరమణ
No comments:
Post a Comment