Sunday, April 5, 2015

బ్రతుకు రహస్యం

ఏమిటీ రహస్యం జగన్నాధ నాటకం
నమ్మలేని సత్యము  చావు బ్రతుకు రహస్యం
ఏడుస్తూ పుట్టేటి ఈ  మనిషీ
చచ్చేందుకు ఏడుస్తాడదిఏమిటి?

చంపుకునే బ్రతుకుతాడు,చంపుకుంటు బ్రతుకుతాడు
తనవంతుకు వస్తే మరి తనామునకలౌతాడేమా వీడు
తనది,తనది అనుకుంటూనే  తనదికాని దానికొరకేమో
తనదంతా వెచ్చించీ, తనది  విడిచిపోతాడయ్యో చూడు

ఏడుస్తూ పుడుతుంటే జనాలు
పండుగగా నవ్వుతారు మనోళ్ళు.
నవ్వుతూ బ్రతుకుతుంటే మరీళ్ళు
ఓర్వలేక ఏడుస్తారేమిటి వీళ్ళు !!

గుర్రమెక్కిపోతుంటే,మూగజీవి పాపమని,
జాలిపడీ చూస్తారు,గర్వమని యంటారు.
సరేకదా పాపమనీ గుర్రమొదిలి నడుస్తుంటె
గుర్రముండి  నడుస్తాడు వెర్రివాడనీ
విరగబడీ నవ్వుతారు.జనాలండి వీళ్ళు.

వానొచ్చి తడుస్తుంటే ఎండగోరు ఈమనిషి
ఎండగాచినప్పుడు చలిని కోరుకుంటాడు
చలికాలం రాగానే ఎండ కోరుకుంటాడు
కోరుకున్న కాలమెపుడు చేరువ కాదు
చేరుకునే లోపలే చేల్లిపోతాడు, చెల్లిపోతాడు!
ఏమిటీ రహస్యం చావు బ్రతుకు రహస్యం?

..................య.వెంకటరమణ

No comments:

Post a Comment