Sunday, April 5, 2015

మిత్రమా నీవెక్కడ?

మిత్రమా! ఎక్కడున్నావయ్యా?
ఒంటరి నాకు, స్నేహం నేర్పావు
స్నేహం నేర్చిన నన్ను ఒంటరినేలిటుజేసావ్?
టూరింగు హాల్లో నేల టిక్కెట్టుకోసం
నిక్కరు చింపుకుని చొక్కాతో కప్పెట్టుకున్నా రోజులు
ఎక్కాలు రాలేదని లెక్కలు మాష్టారికి బయపడి
పక్కతోటలో మామిడి చెట్టెక్కి కూర్చుంటే
తోటమాలి తరిమి వెంటాడినా సంధర్భాలూ
చెరుకు ముక్కకోసం లాటంతా విప్పేస్తే
లాగూ చొక్కా విప్పి పంపిన తమాషాలు
క్లాసు బెంచీల మీద ప్రేమం సందేశాలూ
గుర్నాధం గారేయించిన గోడకుర్చీలు
గుర్తొస్తున్నాయిరా నేస్తం!
బాగా గుర్తొస్తున్నాయి.

గంటల తరబడి తరగని ఊసులు
ఇసుక తెన్నులో కట్టిన గూళ్ళూ
కొట్టుకు పోయాయోరే,
కొట్టుకు పోయాయపుడే
అప్పుడు మనం నడిచిన
అడుగుజాడలికడేమీ లేవు

అందుకేనేమోరా
దారి తప్పిపోయారు మన పిల్లలు
ఎప్పుడు చదివామో తెలియకుండగా
మన చదువులు సాగాయపుడు.
బాల్యమెప్పుడొచ్చిందో తెలియకుండా
సాగుతున్నాయి వీళ్ళ చదువులు
పొద్దున్న పరిచయం సాయంత్రానికి ఫ్రెండు
సాయంత్రం ఫ్రెండు ఉదయానికి ఎండు
ఇదిరా బాబు ఇపుడున్న ట్రెండు

ఇదీ మంచిదేలేరా
నీకోసం ఏడుస్తున్న నీ ఫ్రెండు పరిస్థతి మాత్రం
వీళ్ళకెపుడూ రానే రాదురా
అయినా
నీకోసం ఏడ్చే ఈ ఏడుపులో అనుభూతి
ఉండదుగా వీళ్ళకి
 అది నా ప్రాప్తి ! అది నా ప్రాప్తి !!

No comments:

Post a Comment