ఏనుగు ఎంతో అనుకుంటే,ఏందిరబాబూ చేసింది
ఎలగకాయను ఎరగా జూపి. గుంజంతా అది మింగింది
గారడి మాటలు గంపలు గంపలు. గంపల్లోనే ముంతల్లేవు
ముంతలు ముంతలు,ముంతల్లో మరి మెతుకుల్లేవు
ముంతల్లో మరి మెతుకుల్లేవు,బడుగు వాళ్ళకి బ్రతుకుల్లేవు!
అక్కడి ఆశలు ఇక్కడజూపి, ఎక్కడికయ్యా నీ పరుగులాట
తొక్కుడు బిళ్ళ, దూదూ పుల్ల వెలిగేదెట్లా పొయ్యలో పుల్ల
ఆనకట్లకు అదుపుల్లేవ, పంట భూములకు నీళ్ళే లేవు
పంపకాలు మరి తెలియవు కానీ పంచాయితీలకు సిద్ధం
ఇద్దాం ఇద్దాం , గోతులు తీద్దాం.ఎవడికి వాడే రాజై పోదాం!
రాజైతేమి రాణైతేమి రానివాటికి లెక్కలు వెయ్యను.
రాని వాటికి లెక్కలెయ్యను,ఉన్నవాటిని ఊడ్చుకుబోవన్
గండిపేటలో గండ్ర కప్పలు,మండపేటలో ఆకలి మంటలు
విజయవాడలో వేసారు ప్లాను,ఎసరే లేదు ఎలాగ బాబూ
ఎసరుకు లేదూ ఎలాగబాబూ, ఎవడికి వాడే నవాబు సాబు
ఆకలి మాట అటుంచు భాయి , ఆస్థులుకొంటే రిబేటులోయి
ఆశలగీతలు అంబరులోన, ఆకలి మాత్రం అంగడులోన
అదిగో స్విస్సు ,అదికద బేసు. కొంచెం మిస్సు,అంతా తుస్సు
పార్లమెంటులో బిల్లులు పాసు, బిల్లుల్లో మరి చిల్లులు బేసు
ఎదురు చూపులు ఏటేటున్నాయ్, ఎవడికి వాడే బాబంటున్నాయ్
ఎదురుచూడడం అది ఒక తృప్తి, ఆకలికంతే కన్నీళ్ళు ప్రాప్తి !!
య.వెంకటరమణ
No comments:
Post a Comment